mictv telugu

చలికాలంలో తినాల్సిన పళ్లు ఇవే..

January 24, 2019

పళ్లంటే ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి. అయితే అన్నీ పళ్లూ అన్నీ సీజన్లలోనూ లభించవు. ఒక్కో కాలానికి ఒక్కో రకమైన పండు దొరుకుతుంది.  కాలానికి తగ్గట్లు, ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని పళ్ళను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తారు. మరి చలికాలంలో ఎలాంటి పళ్లు తినాలో తెలుసుకుందాం.Telugu news These are the fruits to eat in winter ..చలికాలం అనగానే కాస్త వేడివేడిగా కాఫీలు, టీలు తాగాలనుకుంటారు. వాటిని తగ్గించి ఈ కాలంలో దొరికిన పళ్లను తింటే ఒంటికి మంచిది. చలికి తట్టుకోలేక చర్మం పొడిబారటం, నల్లబడటం వంటి సమస్యలు వుంటాయి. కాబట్టి ఈ పళ్లను తీసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి, దానిమ్మ, స్ట్రాబెర్రీ, ఆపిల్‌, అరటి, సీతాఫలం, కివిపండు, సపోటా వంటి పండ్లు తినడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

మనకు ఈ పళ్ళు అన్నీ కాలాల్లో దొరుకుతాయి గానీ సీతాఫలం ఒక్కటే చలికాలం మాత్రమే లభించే పండు. ఈ పండు ఎంత ఎక్కువగా తింటే అంత ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు వైద్యులు.

ఏ పండు ఎంత ఉపయోగం..

బొప్పాయి :

బొప్పాయి పండులో విటమిన్‌ ‘ఎ’ సమృద్ధిగా ఉంటుంది. ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసే గుణం ఎక్కువగా వుంటుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా వుంటుంది. ఈ పండులో ఉండే పైపైన్‌ అనే ఎంజైమ్‌ మృత కణాలను తొలగిస్తుంది. బొప్పాయి పండు చర్మ సంరక్షణకు మంచి యాంటీ ఏజెంట్‌గా పని చేస్తుంది.Telugu news These are the fruits to eat in winter ..దానిమ్మ :

దానిమ్మ పండులో చర్మ కణాలను ఉత్పత్తి చేసే గుణం ఎక్కువగా వుంటుంది. ఇది అత్యధిక పోషక విలువలు కలిగిన పండు అని చెప్పొచ్చు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు తగ్గుముఖం పడతాయి. మొటిమలను తొలగించటంతో ఈ పండు కీలకమైన పాత్ర పోషిస్తుంది. చలికాలంలో చర్మ కణాలను బిగుతుగా ఉంచుతుంది.

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి.  ఈ పండు తినటం వల్ల శరీరం డిటాక్సిఫీకేషన్‌ చేయబడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడం, చర్మాన్ని కాంతివంతంగా వుంచడంలో ఈ పండు సహకరిస్తుంది. అందానికి సంబంధించిన క్రీములు, పదార్థాలు తయారు చేయటంలో ఎక్కువ శాతం స్ట్రాబెర్రీ పండు జెల్‌ను ఉపయోగిస్తారు.

Telugu news These are the fruits to eat in winter ..

ఆపిల్‌ :

ఆపిల్‌ పండులో విటమిన్‌ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. నిర్జీవంగా, పొడిబారిన చర్మం ఉన్నవారు ఆపిల్‌ పండు తింటే మంచి ఫలితం ఉంటుంది.  ఇది ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు రాకుండా కాపాడుతుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇవి తీసుకోవటం వల్ల నల్ల మచ్చలు తొలగిపోతాయి.Telugu news These are the fruits to eat in winter ..

అరటి :

అరటి పండులో పొటాషియం, విటమిన్‌ ‘ఇ’, ‘సి’ ఉంటాయి. ఇది తినడం వల్ల శరీరం హైడ్రేట్‌ అవుతుంది. ఇది మంచి మాయిశ్చరైజర్‌‌గా పని చేస్తుంది. రోజుకొకటి తిన్నా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

సీతాఫలం :

సీతాఫలంలో విటమిన్‌ ‘ఎ’, ‘సి’ ఎక్కువగా వుంటాయి. మృత కణాలను తొలగించి కొత్త కణాలను ఉత్పత్తి చేయటానికి ఉపయోగపడుతుంది. ఇవి శరీరంలోకి ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మానికి మంచి స్క్రబ్‌లా పని చేస్తుంది.  Telugu news These are the fruits to eat in winter ..

కివి పండు :

విదేశీ పండు కివి పండు. ఇది తినడం వల్ల విటమిన్‌ ‘సి’, శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. చర్మం మృదువుగా, అందంగా తయారవుతుంది.Telugu news These are the fruits to eat in winter ..

సపోటా :

సపోటా పండు మంచి రుచికరంగానే కాదు ఇందులో బోలెడు పోషకాలు వున్నాయి అంటున్నారు వైద్యులు. ఇది శరీరంలోని హానికారక బ్యాక్టీరియాను చంపేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని పీచు పదార్థం ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పెద్దపేగుకు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. ఇందులోని పోషకాలు తీవ్రమైన దగ్గు నుంచి ఉపశమనం ఇస్తాయి. ముక్కులో, శ్వాసనాళంలో పేరుకుపోయిన స్ఫుటం, దుమ్మూ, ధూళిని బయటకు పంపిస్తాయి.

Telugu news These are the fruits to eat in winter ..

సపోటలోని మినరల్స్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, ఎ, ఇ, సి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఎముకలను పటిష్ఠం చేసే గుణం అధికంగా వుంటుంది. దీనిలోని కాపర్‌ ఎముకల కణజాల ఉత్పత్తిని పెంచి, ఆస్టియోపోరోసిస్‌, కండరాల బలహీనత, ఎముకలు విరిగిపోవడం, కీళ్లు బలహీనంగా మారడం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. చలికాలం కీళ్లనొప్పులతో బాధపడేవారు సపోటాలను తింటే ఉపశమనం లభిస్తుంది. కేశాల సంరక్షణకు ఈ పండు ఉపకరిస్తుంది.