mictv telugu

పొట్ట తగ్గాలంటే ఇవి తినాలి.. ఇలా చెయ్యాలి..!

January 26, 2019

వెనుక తరాల వారితో పోలిస్తే మనలో చాలామందికి  శారీరక శ్రమ తగ్గింది. అప్పుడందరు ఎండా,వానా, చలి అనకుండా పొద్దస్తమానం కష్టపడేవారు. ఫలితంగా శరీరానికి మంచి వ్యాయామం అయ్యేది.  రివటలా వుండేవారు. రానురాను మనుషుల జీవన శైలి మారింది. ఎండా, వానా, చలిలో పనిచేయడం తగ్గిపోయింది. ఏసీల్లో కూర్చుని పని చేసుకుంటున్నారు. దీంతో శరీరానికి వ్యాయామం లేక పొట్ట పెరుగుతుంటుంది. పెళ్లి కాకముందే పొట్ట రావడంతో అంకుల్స్‌లా కనిపించడంతో చాలా మందిలో ఇదో రకమైన దిగులు పెరిగిపోతోంది. దీనికి తోడు అధిక బరువు కూడా పెరిగిపోతున్నారు.Telugu news These can reduce the stomach.. What to doచాలామంది సిక్స్ ప్యాక్ చేసుకుని హీరోల్లా కనిపించాలని కలలుగంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఎందుకంటే శారీరక శ్రమలకు వారి వారి శరీరాలు అలవాటు పడలేదు గనక. సుఖాలకే ఎక్కువ అలవాటు పడటంతో వాకింగ్, జిమ్ వంటివి చేయకుండా పొట్టలు పెంచుకుంటున్నారు. మరి ఈ పొట్టను తగ్గించుకోవడానికి కొన్న చిట్కాలు పాటిస్తే ఫలితాలుంటాయి.

పొట్ట తగ్గించుకోవడానికి చిట్కాలు

నిమ్మకాయ : వీటిలో విటమిన్ ‘సి’ అధికంగా వుంటుంది. జీవప్రక్రియ పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. స్లిమ్‌గా ఉంచుతుంది. ఎసిడిటీ తగ్గించి మొండి రోగాలను దూరం చేస్తుంది. ఉదయాన్ని గ్లాసెడు గోరువెచ్చని మంచినీళ్లలో అర చెంచాడు రసంలో రెండు చెక్కల తేనె కలిపి తాగాలి.

గ్రీన్ టీ: గ్రీన్ టీ బరువు తగ్గించడంలో సమర్ధవంతమైంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ద్రవాన్ని నియంత్రణ చేయడానికి మరియు బరువు పెరగకుండా నియంత్రించడానికి ఉపయోగపడుతుంది, మరియు తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు సులభతరం చేస్తుంది. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ త్రాగేవారిలో 11% బరువు తగ్గించవచ్చు.

రోజుకి కనీసం వంద కెలరీలు ప్రొటీన్ల ద్వారా శరీరంలోకి చేరాలి. చికెన్, గుడ్లు, పాలు, మీగడ తీసిన పెరుగు మంచి మోతాదులో పోషకాలను అందిస్తాయి. కొవ్వు తక్కువగా ఉండి, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండే ఆహారం మీద మనసుపెట్టాలి.

కొవ్వు అదుపులో ఉండాలంటే రోజుకి కనీసం పది గ్రాముల ఫైబర్ శరీరంలో చేరాలి. ఇందుకోసం యాపిల్, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి, టొమాటో, క్యాబేజీ, చిలగడదుంప, కాయగూరలు, అటుకులు, పొట్టు తీయని తృణధాన్యాలు, బీన్స్, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. అయితే పీచు పదార్థాల వలన గ్యాస్ ఏర్పడుతుంది. కాబట్టి నీళ్ళు బాగా తాగాలి. కనీసం 8-10 గ్లాసుల నీళ్ళు రోజూ తాగాలి.

తెల్లని బియ్యం కారణంగా ఉదరభాగం ఉబ్బుగా మారే అవకాశాలు బాగా ఎక్కువ. కాబట్టి దానికి బదులుగా గోధుమలు, దంపుడు బియ్యం, జొన్నలు, కొర్రబియ్యం…వంటివి వాడడం మొదలు పెట్టాలి. చిన్న చిన్న పరిమాణాలలో పలు దఫాలుగా ఆహారం తీసుకునే వేళలు సవరించుకోవాలి. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌ కాస్త ఎక్కువగా తీసుకన్నా పర్లేదు. అక్కడి నుంచి తగ్గిస్తూ వెళ్లాలి. రాత్రి 7-8గంటల లోపు తినే కార్యక్రమం ముగించుకోవాలి.

చేయాల్సిన వ్యాయామాలు..

సైక్లింగ్ : పొట్ట తగ్గడానికి ఇది మంచి వ్యాయామం. సైక్లింగ్ వ్యాయామం 15 నుండి 20 నిమిషాలు చేయాలి.

పుల్ అప్స్ : వెల్లకిలా పడుకుని చేతులు తలకింద పెట్టాలి. శరీరంపై భాగాన్ని పైకి లేపాలి. మోకాళ్ళు 4 నుండి 5 అంగుళాలు నేలనుండి పైకి లేవాలి. ఈ పొజిషన్ 2 నుండి 3 నిమిషాలు వుంచాలి.

కాలి వ్యాయామం : వెల్లకిలా పడుకొని మోకాళ్ళను తిన్నగా క్రాస్ చేస్తూ పైకి లేపాలి. చేతులు తలవెనుక పెట్టాలి. మెడను ముందుకు లాగవద్దు. ఈ పొజిషన్ ఒక్క నిమిషం తర్వాత రిలాక్స్ అవాలి. ఇలా 10 నుండి 15 సార్లు చేయాలి.

చేతుల వ్యాయామం : వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్ళు వంచి చేతులు తలవెనుక పెట్టాలి. పైకి శరీరాన్ని లాగాలి. ఈ పొజిషన్‌లో ఒక్క నిమిషం వుండాలి. మెడ నొప్పి పెడితే ఒక చేయి మెడకు సపోర్టుగా ఇవ్వాలి. దీనిని 8 నుంచి 10 సార్లు చేయాలి.

ఈ వ్యాయామాలు రోజూ చేస్తే పొట్టను తగ్గించవచ్చు. వయసు పైబడివారు, కొత్తగా వ్యాయామాలు మొదలు పెట్టేవారు వైద్యుల సలహాతో తగిన వైద్య పరీక్షల తర్వాత మొదలుపెట్టాలి.