బీజేపీలోని హీరోయిన్లు కూడా అలాంటి వారేనా ? - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలోని హీరోయిన్లు కూడా అలాంటి వారేనా ?

November 24, 2017

బీజేపీ నేతలందరూ ‘ పద్మావతి ’ సినిమాపై కక్ష్ గట్టి చేస్తున్న ఆరోపణలపై  ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చర్చలో పాల్గొన్న భరధ్వాజ ఈ విధంగా స్పందించారు.  సినీ పరిశ్రమలోని మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడే వ్యక్తులు ప్రజాప్రతినిధులు కావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలోని మహిళలంతా అలాంటివారే అయితే.. బీజేపీలో ఉన్న నటీమణులు కూడా ఆ కోవకు చెందినవారా ? అని ఆయన ప్రశ్నించారు. ఇంత కుసంస్కారంగా మాట్లాడేవారితో నేను మాట్లాడలేను. ఆ స్థాయికి నేనింకా దిగజారలేదు.. ఈ చర్చలో పాల్గొనలేనని లేచి వెళ్లిపోయారు.  అనంతరం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ‘సినీ నటీమణులకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ నిండా కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. సంజయ్ లీలా భన్సాలీ ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం వున్నది’ అని అన్నాడు.  

బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ సినిమాను నిషేధించిన విషయం తెలిసిందే. బీజేపీ నేత చింతామణి మాలవీయ ‘ సినిమా కుంటుంబాల్లోని మహిళలు ప్రతిరోజూ  పరుపు మార్చినంత తేలికగా భర్తలను మార్చేస్తుంటారు.. దుష్ట మనస్తత్వాలతో నన్ను చికాకు పెట్టే దర్శకులను చెప్పుతో కొడతానని ’ రెండు వారాల క్రితం వ్యాఖ్యానించారు. అదే బాటలో రాజస్థాన్‌కు చెందిన ఓ ఎంపీ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. అందుకు మద్దత్తుగా ఇది ముమ్మాటికీ వాస్తవమని ఒక టీవీ meనెల్ చేపట్టిన చర్చలో రాజాసింగ్ సమర్థించారు. సినీ పరిశ్రమలో మహిళలలు అలాంటి పనులే చేస్తున్నారని మాట్లాడారు.