mictv telugu

గంజాయి కొట్టడానికి పోతే.. పెద్దపులి దర్శనం..

February 12, 2019

వాళ్లిద్దరూ గుట్టచప్పుడు కాకుండా గంజాయి దమ్ముకొడతామని పథకం వేశారు. మనుషుల అలికిడి లేని ఓ పాత భవంతిలోకి వెళ్లారు. గంజాయిని బయటికి తీస్తుండగా.. పులి గాండ్రింపు వినిపించింది. గుండెలు అదిరిపోయాయి. పులి గర్జన వినిపిస్తోందిగాని, అది కనిపించడం లేదు. మనోళ్లు గంజాయిగాళ్లు కదా.. ఆసక్తితో అసలు అక్కడ పులి ఉందా, లేకపోతే ఏదైనా వాయిస్ రికార్డింగా అని డౌటొచ్చి వెతికారు. వాళ్లకు భూమిపైన నూకలు ఉన్నాయి. పెద్దపులి బోనులో కనిపించింది. అదికూడా మామూలు పులి కాదు.. బోనులో తిని బలిసిన అరటన్ను బరువున్న మృగం.  Telugu news They were looking for a place to smoke marijuana America Houston  Police said they found a tiger insteadగంజాయి ప్రియులు వణికిపోతూ అక్కడి నుంచి తుర్రుమన్నారు. విషయం పోలీసులకు చేరవేశారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని పులికి మత్తుమందు ఇచ్చి జూకు తరలించారు. అమెరికాలో హూస్టన్‌లో సోమవారం ఈ తతంగం జరిగింది. మొదట ఫోన్ లో వివరాలు విన్న పోలీసులు.. తమను ఆటపట్టించడానికి ఫోన్ చేశారని భావించారు. ‘మీరు గంజాయి కొట్టడానికి వెళ్లారా? లేకపోతే ఆల్రెడీ కొట్టేసి వెళ్లారా? గంజాయి మత్తులో పులీగిలీ అనడం లేదుగా?’ అని ప్రశ్నించారు. వారు మత్తులో కాకుండా మామూలుగానే సమాధానం చెప్పడంతో పులి వద్దకు వెళ్లారు.