mictv telugu

వాళ్ళేమోగానీ.. వాహనదారులైతే పండగ చేసుకుంటున్నారు..

January 13, 2019

సంక్రాంతి పండగ సందర్భంగా నగరం మొత్తం ఖాళీ అయినంత పనే అయింది. అందరూ పల్లెబాట పట్టారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఇసుక వేస్తే రాలనంత జనం నిండిపోయారు. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సుల సదుపాయం పెంచినప్పటికీ జనాలకు సరిపోవడంలేదు. కొన్ని బస్సుల్లో అయితే నిల్చోవడానిక్కూడా స్థలం దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఊళ్లకు వెళ్లాలంటే చాలామంది ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది.  ఇవాళ కూడా ఇంకా ఊళ్ళకు వెళ్లేవాళ్లతో జూబ్లీ బస్టాండ్, గాంధీ బస్టాండ్‌లు కిటకిటలాడుతున్నాయి. బస్టాండు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటుచేశారు. బస్సులు జామ్ అవ్వకుండా వాళ్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు.

నగరం నుంచి ఊరెళ్లేందుకు రైల్వే టిక్కెట్లు 4 నెలల ముందే అందుబాటులోకి వచ్చినప్పటికీ క్షణాల్లోనే అయిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టిక్కెట్‌ దొరకనివారు అప్పటినుంచి ఆర్టీసీ బస్సుల రిజర్వేషన్ల కోసం చూశారు. నెలముందు నుంచి ఈ ప్రక్రియ ఆరంభమై అవి కూడా అయిపోయాయి. ఇక మిగిలిన ఆఖరి ఆశ ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లే. ఇదే అదనుగా భావించి చాలా మంది వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. ఎలాగైనా ఊరు వెళ్ళాల్సిందే కాబట్టి దాన్ని కొందరు ప్రేవేట్ వాహనదారులు క్యాష్ చేసుకుంటున్నారు.

Telugu news They're doing .. The motorists are getting festive though ...Telugu news They're doing .. The motorists are getting festive though ...

అదనపు ఛార్జీలతో దోచుకుంటున్నారు…

ప్రైవేట్ వాహనాలే కాదు ఆర్టీసీ కూడా వడ్డన మొదలుపెట్టింది. 50 శాతం అదనంగా వసూలుచేస్తోంది. ఇక ప్రైవేటు ఆపరేటర్లకైతే ఏ అడ్డూ అదుపూ లేకుండా పోయింది.  కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం వంటి దూర ప్రాంతాలకు ప్రైవేటు బస్సుల్లో టికెట్‌ ధర రూ.3,500-4000 వరకు అమ్మేస్తున్నవారు ఉన్నారు. ఇక విజయవాడకు సైతం రూ.1500 వరకు తీసుకుంటున్నారు. దీంతో నలుగురు కుటుంబ సభ్యులు రానుపోను బస్సు ఛార్జీలకు రూ. 25 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ద.మ.రైల్వే సువిధ పేరిట ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు 5నుంచి 6వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వీటిలో కూడా అదనపు వడ్డనలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో టికెట్‌పై రూ.3-4 వేలు వసూలు చేస్తోంది. ఇదిలావుండగా ఇంటి నుంచి బస్టాండుకో, రైల్వే స్టేషన్‌కో వెళ్ళాలంటే ఆటోలవాళ్ళు డబల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అదేంటని అడిగితే ఊళ్లకు వెళ్ళేవాళ్లతో సిటీలో ట్రాఫిక్ జామ్ వుంది తప్పదు అంటున్నారు. దీంతో తప్పదన్నట్టు ప్రయాణికులు అదనపు ఛార్జీలు పెట్టి బస్టాండ్‌లకు వెళ్తున్నారు.

క్యాబ్‌లు కూడా పండగను పురస్కరించుకుని రేట్లు పెంచేశాయి. ఊరెళ్లి పండగ చేసుకోవడం ఏమోగానీ వాహనదారులు ఇక్కడే అదనపు సంపాదనతో పండగ చేసుకుంటున్నారు.Telugu news They’re doing .. The motorists are getting festive though ..