mictv telugu

షాకింగ్.. ఎంఐ మొబైల్ ఫోన్ల లారీ దోపిడీ..

February 13, 2019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో ఘరానా దొంగతనం జరిగింది. జిల్లాలోని తడ సమీపంలో ఉన్న శ్రీ సిటీ నుంచి ఎంఐ బ్రాండ్ల మొబైల్ ఫోన్ల లారీ కలకత్తాకు బయలుదేరింది. లారీని గమనించిన కొందరు దొంగలు లారీ దగదర్తి జాతీయ రహదారిపైకి రాగానే అడ్డగించారు. అందులోనుంచి డ్రైవర్‌ను దింపేసి.. చెట్టుకు కట్టేసి లారీతో ఉడాయించారు. డ్రైవర్ చెట్టుకు కట్టేసి ఉండడంతో అతడిని గమనించిన స్థానికులు విడిపించారు.

Telugu News thieves stole mobile phones lorry load in Nellore.

డ్రైవర్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ధి సమయానికి లారీని కావాలి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. కానీ అందులో ఉండాల్సిన సెల్‌ఫోన్లు దొంగలించారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జాతీయ రహదారపై ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. సెల్‌ఫోన్ కంపెనీల నుంచి సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. భారీ మొత్తంలో మొబైల్ ఫోన్లు చోరీ కావడం జిల్లాలో సంచలనం రేపుతోంది.Telugu News thieves stole mobile phones lorry load in Nellore