mictv telugu

పోల్‌డాన్స్ చేసిన 73 ఏళ్ళ బామ్మ.. వీడియో

January 14, 2019

సహజంగా ఎవరైనా వయసు పైబడితే భక్తి భావంలో మునిగి తేలుతుంటారు. కూర్చున్న చోటే ఇష్ట దైవాలను కొలుచుకుంటారు. ఇంట్లో మనవలు, మనవరాళ్లకు కథలు చెప్తూ టైంపాస్ చెస్తారు. కానీ ఓ 73 ఏళ్ల బామ్మ పోల్ డాన్స్ చేశారు. ఈ రోజుల్లో కొంతమంది 30ఏళ్ల వయసుకే కీళ్ల నొప్పులంటూ కూలబడిపోతున్నారు. అలాంటివాళ్లకు సవాల్ విసురుతున్నారు ఈ బామ్మ.

చైనాకు చెందిన ఆమె పేరు డయా డాలి. ఆమె డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒంటి మీద ఏడు పదుల వయసుంది.. అయినా కుర్రదానిలా చిందేస్తోంది. ఆమె శరీరం కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా వుంది. ఆమెను అలా చూస్తే 16ఏళ్ల పడుచు పిల్లే అనుకుంటారు ఎవరైనా. ఈ వయసులో ఆమె క్లిష్టమైన పోల్ డాన్స్ చేయడమే ఓ వింత అయితే ఆమె ఈ డాన్స్ ఎప్పుడు నేర్చుకుందో తెలిస్తే షాకవ్వాల్సిందే. తన 65ఏళ్ల వయసులో ఈ డాన్స్ నేర్చుకున్నారామె.

క్లబ్‌లలో డాన్స్ చేసేవారిని చూసి స్ఫూర్తి పొంది దీనిని హాబీగా మార్చుకున్నానని చెబుతున్నారు బామ్మ. క్రింది లింకులో మీరూ ఈ వీడియో చూసెయ్యండి.

Telugu news This 73-year-old pole dancer granny shows age is just a myth. Watch jaw-dropping video