కుబేరుల డెన్.. ఎంట్రీ ఫీజ్ 8 కోట్లు! - MicTv.in - Telugu News
mictv telugu

కుబేరుల డెన్.. ఎంట్రీ ఫీజ్ 8 కోట్లు!

February 8, 2018

మెంబర్‌షిప్ కోసం సంవత్సరానికి రూ. 8 కోట్లు వసూలు చేసే అత్యంత ఖరీదైన క్లబ్ ఏదైనా వుందా అంటే అది ఇదే. ఈ ఫొటోలో కనిపిస్తున్నదే ఆ క్లబ్. రూ. 8 కోట్లు తీసుకున్నట్టుగానే కష్టమర్లకు సేవలు కూడా భారీగానే చేస్తారు. వీవీఐపీ సౌకర్యంతో పాటు ఇక్కడికి వచ్చేందుకు ప్రైవేట్ జట్ సౌకర్యం కూడా కల్పిస్తారు. ఈ క్లబ్ ఇంటీరియర్ ఒక లగ్జరీ బార్‌ను తలపిస్తుంది. ఇది కేవలం మగవారికి మాత్రమే. అక్కడ పనిచేసే స్వీపర్లు వంటి ఆడవాళ్లు తప్పిస్తే మరో ఆడపురుగు కనిపించదు.. ఇది జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ఉంది. కానీ ఏ ప్రాంతంలో ఉందో ఎవరికీ తెలియదు.  ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన మెన్స్ క్లబ్‌గా ఇది ప్రఖ్యాతి గాంచింది. ఈ క్లబ్‌లోకి సామాన్యులకు ప్రవేశం వుండదు. కేవలం ధనవంతులు మాత్రమే దీనిలో మెంబర్‌షిప్ పొందటానికి అర్హులు. తాజాగా ఈ క్లబ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అవడంతో.. జర్మనీలోని మ్యూనిచ్‌లో భూమి లోపలి భాగాన ఈ క్లబ్‌ను నిర్మించారని సమాచారం. వీటిని పరిశీలిస్తే ఇక్కడికి ఎంతటి ధనవంతులు వస్తారో అంచనా వేయవచ్చు. మధ్యయుగాల నాటి వాతావరణం, మసక చీకటి, ఖరీదైన మద్యం వంటివి ఇందులో ఉన్నాయి.