తల తెగినా ఈ కోడింకా బతికే వుంది - MicTv.in - Telugu News
mictv telugu

తల తెగినా ఈ కోడింకా బతికే వుంది

March 30, 2018

ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా శరీరంలో ఏ అవయవం పని చేయకపోయినా బతగ్గలదు. మనిషి కూడా అంతే యాక్సిడెంటులో కాలు పోయినా, చేయి పోయినా, పక్షవాతం వచ్చినా, ఇంకా ఇతరాత్రా రోగాలు ఏవి వచ్చినా బతగ్గలడు. కానీ ఈ కోడి మాత్రం తల లేకుండా వారం రోజులుగా బ్రతికుతూ వైద్య రంగానికి తల తిరిగినంత పని చేస్తోంది. ఈ విచిత్ర కోడి థాయిలాండ్‌లోని రచ్చబురి రాష్ట్రంలో వుంది. ఈ కోడిని ఓ పశువైద్యురాలు సంరక్షిస్తున్నారు. శరీర భాగాలు ఏవి పని చేయాలన్నా దానికి నాడీ మండలం నుండి లింక్ వుంటుంది. అది తలలోనే వుంటుంది. కాబట్టి తల లేకుండా బతకడం అనేది అసాధ్యం అంటున్నారు డాక్టర్లు.దానికి ఈ భూమ్మీద నూలకు ఇంకా బాకీ వున్నాయి కాబోలు అందుకే తల తెగినా బతుకుతోందంటున్నారు.1945-47 మధ్య అమెరికాలో ఓ కోడి ఇలాగే తల లేకుండా 18 నెలలు జీవించి రికార్డులకు ఎక్కిందట. మరి ఇదెన్ని రోజులు బతికి ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అంటున్నారు స్థానికులు. దాని మెడ కిందగా గొంతులోకి ఆహారం వేస్తూ.. యాంటిబయాటిక్స్‌ ఇస్తూ పోషిస్తున్నారు పశు వైద్యురాలు. ఏదో జంతు దాడిలో తల తెగిపోయి రక్తం కూడా పోయాక అదింకా చావకుండా బతికే వుండటంతో దాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అది తల లేకపోయినా బాగానే స్పందిస్తుందట. ఇది నిజంగా ధైర్యమున్న కోడే. అందుకే తల లేకపోయినా మొండిగా బతికేస్తోంది.