హీరో డైరెక్షన్ లో మరో హీరో!  - MicTv.in - Telugu News
mictv telugu

హీరో డైరెక్షన్ లో మరో హీరో! 

September 11, 2017

హీరోలు చాలా అరుదుగా దర్శకత్వం వైపు మళ్ళుతుంటారు. ఆ దారిలోకిప్పుడు ‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్ రవీంద్రన్ కూడా వస్తున్నాడు. ఆల్రెడీ లీడింగ్ లో వున్న ఒక హీరో ఇంకొక హీరోని డైరెక్ట్ చెయ్యడమనేది నాట్ ఎ జోక్. ఇంతకూ ఈ హీరో డైరెక్ట్ చేస్తున్నది ఏ హీరోననుకుంటున్నారు..? కరెంట్, అడ్డా చిత్రాల హీరో సుశాంత్ నే. ‘ రామ్ కామ్ ’ పేరుతో ఈ సినిమా ఈ ఏడాది నవంబర్లో షూటింగ్ కు వెళ్ళనుంది.

రాహుల్ రవీంద్రన్ ది అసలు కల దర్శకత్వమేనట. ఇండస్ట్రీలో అతను దర్శకుడినైతే చాలనుకున్నవాడు హీరో అయిపోయాడు. ఇండస్ట్రీలో ఏదో అయిపోదామని వచ్చి ఏదో అయిపోయినవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఒక లైట్ బోయ్ పుణ్యమా అని తను హీరోనయ్యానని రాహుల్ ఎప్పుడూ అంటూ ఉటాడు. ఇప్పుడు తన కలని నెరవేర్చుకుందామనుకుంటున్న రాహుల్ కు ఆల్ ది బెస్ట్ చెబుదామా !