mictv telugu

మాజీ లవర్ ఫోటో తగలబెడితే ఫుడ్ ఫ్రీ

February 14, 2019

ఈరోజు ప్రపంచ పేమికుల దినోత్సవం. ప్రేమికులు ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజుని హోటల్స్, రెస్టారెంట్లు పబ్లిసిటీ కోసం రకరకాల ఆఫర్లు పెట్టి వాడుకుంటున్నాయి. కొన్ని అయితే ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నాయి. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని ఓ రెస్టారెంట్ యూత్‌కు విచిత్రమైన ఆఫర్ ఇచ్చింది. ‘మీ మాజీ లవర్ ఫొటోను తగలబెడితే భోజనం తరువాత ఫ్రీగా స్వీట్ లేదా ఐస్ క్రీమ్‌ను అందిస్తాం’ అని ప్రకటించింది.

Telugu News This Indian Cafe is Offering Free Dessert for Burning Your Exs Pic on Valentines Day.

బెంగళూరుకు చెందిన రౌండప్ కేఫ్ ఈ ఆఫర్ ఇచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ఐడియా నిజంగా బాగుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడగా, ప్రేమికుల దినోత్సవం రోజున ఇలాంటి పిచ్చిపనులు ఏంటని మరికొందరు మండిపడుతున్నారు.Telugu News This Indian Cafe is Offering Free Dessert for Burning Your Exs Pic on Valentines Day