ఇది కేసీఆర్ ఆడుతున్న కొత్త డ్రామా - MicTv.in - Telugu News
mictv telugu

ఇది కేసీఆర్ ఆడుతున్న కొత్త డ్రామా

March 5, 2018

‘ ఇన్ని రోజులు దేశానికి కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదు. థర్డ్ ఫ్రంట్ అనివార్యముంది ’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. తృతీయ ఫ్రంట్‌పై దేశం నలుమూలల నుండి కేసీఆర్‌కు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్లు చేసి అభినందించడం విశేషం. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ వ్యూహాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ‘ కేసీఆర్ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం వేరే వుంది. ఆయన కేసులకు భయపడి ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అంటున్నారు.మోడీ అంటే గజగజ వణికారు. నోట్లరద్దు, జీఎస్టీలకు కేసీఆర్ మద్దతు పలికారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సైతం మద్దతు తెలికారు. ఇది కేసీఆర్ ఆడుతున్న కొత్త డ్రామా ’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కేసీఆర్‌పై తన నిరసన గళాన్ని వినిపించారు. ‘ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే. అవినీతి పాలన సాగిస్తున్న కేసీఆర్.. ఇప్పుడు ఇంటి పోరు పడలేక, ప్రజా వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ‘ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.