వాటర్ గన్.. ఉక్కు గోడలనూ ఛేదిస్తుంది! - MicTv.in - Telugu News
mictv telugu

వాటర్ గన్.. ఉక్కు గోడలనూ ఛేదిస్తుంది!

February 13, 2018

బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను కూడా ఛేదించగల పవర్‌ఫుల్ వాటర్‌గన్‌ అందుబాటులోకి వచ్చింది.  అగ్నిమాపక పరికరాలను తయారు చేసే ‘పైరోలాన్స్‌’ కంపెనీకి చెందిన నిపుణులు దీన్ని అల్ట్రా హైప్రెషర్‌ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ ‘పైరోలాన్స్‌’ వాటర్‌గన్స్‌ను ప్రస్తుతం అమెరికన్‌ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలు ఉపయోగిస్తున్నాయి. 

నీటితోనే పని చేస్తుంది గానీ చాలా శక్తివంతంగా వుంటుంది దీని చర్య. ఉక్కును సైతం చీల్చేయగలదు. దీనిని షూట్ చెయ్యగానే ఇందులోంచి పెనువేగంతో దూసుకొచ్చే నీరు తీవ్రమైన ఒత్తిడితో  కాంక్రీట్, ఉక్కు, ఇటుకలను సైతం ఛిద్రం చేస్తుంది. ఏదైనా గోడపై దీనిని గురిచూసి ప్రయోగిస్తే, మూడంగుళాల రంధ్రం ఏర్పడి, అందులోంచి నీరు లోపలకు దూసుకుపోతుంది.

వీటి సైజును బట్టి 15 డాలర్ల నుంచి 80 వేల డాలర్ల వరకు లభిస్తున్నాయి. కొన్ని విమానాశ్రాయాల్లో ఇవి అందుబాటులో వున్నాయి. రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్,  బస్టాండులు, విమానాశ్రయాలు, సినిమా థియేటర్లు వంటి జనాలు ఎక్కువగా వుండే ప్రదేశాల్లో వీటిని అందుబాటులో వుంచితే అగ్నిప్రమాదాలను తేలికగా అరికట్టవచ్చు అంటున్నారు. అగ్ని మాపక దళాలు వీటిని ఉపయోగిస్తే చాలా వరకు అగ్ని ప్రమాదాలను నివారించవచ్చంటున్నారు ‘ పెరోలాన్స్ ’ కంపెనీకి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు