శ్రీరెడ్డి వెనకాల వున్న ఆ డ్రీమ్‌టీం ఈ నలుగురే.. పవన్ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డి వెనకాల వున్న ఆ డ్రీమ్‌టీం ఈ నలుగురే.. పవన్

April 20, 2018

నటి శ్రీరెడ్డి తన తల్లిని అనరాని మాటలు అందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. శ్రీరెడ్డి అలా వృద్ధురాలైన తన తల్లిని అనటం వెనకాల నలుగురు శక్తులు వున్నారని అన్నారు. వారి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఆ నలుగురిని ‘డ్రీమ్ టీం’ అని పేర్కొన్నారు. వారిలో శ్రీ సిటీ ఓనర్ శ్రీని రాజు, టీవీ9 రవి ప్రకాశ్, ఏబీఎన్ రాధాకృష్ణ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ఫొటోలు ఉన్నాయి. వీరు తమ టీఆర్పీలను పెంచుకోవడం కోసం తన తల్లిని దూషించేలా చేశారని పవన్ పేర్కొన్నారు.

ఈ డ్రీమ్‌టీంలో వున్న వాళ్ళకు తల్లులు, చెళ్ళెళ్ళు, కూతుళ్ళు, కోడళ్ళు వున్నారు. వారందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ

వారి టీఆర్పీలు, రాజకీయ వృద్ధి కోసం తన తల్లి మీదనే అసభ్యకర వ్యాఖ్యలు చేయించారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.      ‘ మీ టీఆర్పీల కోసం మీరు ఇలాంటి షోలు చేస్తున్నారు కదా.. ఇప్పుడు ఆ షోలను మించిన షోను నేను ఇస్తాను చూడండి ’ అంటూ ఘాటుగా సవాల్ విసిరారు పవన్.