టీచరమ్మా...మీరు సూపర్ అమ్మా...ఆదర్శ టీచర్ !   - MicTv.in - Telugu News
mictv telugu

టీచరమ్మా…మీరు సూపర్ అమ్మా…ఆదర్శ టీచర్ !  

February 2, 2018

చిటికెడంత ప్రోత్సాహం కొండంత విజయానికి నాంది పలుకుతుంది ’ అని పెద్దలు అన్నారు. అది అక్షరాలా నిజం అని ఈ పంతులమ్మను చూశాక ఎవరైనా అంటారు. పిల్లలను ఆటల్లో ప్రోత్సహిస్తున్న ఈ టీచర్ వీడియో ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయింది.

పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా చాలా ముఖ్యమే కదా.. అందుకే ఈ పంతులమ్మ పిల్లలను ఇంతలా ప్రోత్సహిస్తున్నది. వాళ్ళు ఖోఖో ఆట ఆడుతుంటే ఇటు వెళ్లు, అటు వెళ్ళు, ప్రత్యర్థికి దొరకకుండా ఇలా తప్పించుకో.. అంటూ గ్రౌండు పక్కన నిల్చొని తానే ఆడినట్టు ఫీల్ అవుతూ పిల్లలను ప్రోత్సహిస్తున్నది. ‘ పిల్లలను ఆటలో ఫుల్ ప్రాక్టీస్ చేయించాం.. ఇక వాళ్ళే ఆడుకుంటారని ’ చాలా మంది టీచర్లు అనుకుంటారు.

కానీ ఈ టీచరమ్మ అంతటితో చేతులు దులుపుకోకుండా గ్రౌండు దగ్గర కూడా పిల్లలను జాగరూకత చేస్తున్న తీరు అక్కడ చాలా మందిని ఆకట్టుకున్నది. ‘ ఆటల్లో పిల్లలను ప్రోత్సహిస్తున్న ఈ పంతులమ్మ తీరు భేష్ ’ అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి టీచర్లు ఉంటే మట్టిలోంచి ఎన్నో మాణిక్యాలు బయటకు రావడం ఖాయం.