‘పద్మావతికి’ సవతి ఈ ‘నాగ్‌మతి’   - MicTv.in - Telugu News
mictv telugu

‘పద్మావతికి’ సవతి ఈ ‘నాగ్‌మతి’  

October 28, 2017

అత్యంత ప్రతిష్టాత్మకంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న సినిమా ‘ పద్మావతి ’. అయితే ఈ సినిమాకు సంబంధించిన పాట ఒకటి ఈ మధ్యే విడుదల చేశారు. అందులో దీపికా నృత్యం చేస్తుంటే షాహిద్ కపూర్ సహా ఇంకొకావిడ కూర్చొని చూస్తుంటారు. ఆవిడ సినిమాలో పద్మావతికి సవతి అవుతుందట.

రతన్ సింగ్ పాత్రలో షాహిద్‌కపూర్ నటిస్తుండగా అతని మొదటి భార్యగా నాగ్‌మతిగా అనుప్రియ గోయెంకా నటిస్తోంది. నాగ్‌మతి పాత్ర కూడా సినిమాలో ప్రాముఖ్యతను సంతరించుకున్నదట. రాజ్‌పుత్ మహారాణి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రం డిసెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతున్నది.