దక్షిణ తెలంగాణలో సీట్లు మొత్తం మావే… - MicTv.in - Telugu News
mictv telugu

దక్షిణ తెలంగాణలో సీట్లు మొత్తం మావే…

February 2, 2018

‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే తాను, తన కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటామని ’ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి మాకు పోటీ వుంటుంది.

దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ మాతో పోటీ పడలేదు. అన్నీ స్థానాల్లో కాంగ్రెస్సే విజయ ఢంకా మోగిస్తుందని ఆయన ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. 2019 లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. ఇది నేను చెప్తున్న మాట కాదు.. జాతీయ సర్వే సంస్థలతో సర్వే చేయించామని ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పాలనపై ప్రజలు చాలా విసుగెత్తిపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఇప్పటికీ రాజకీయాలు చాలా మారాయన్నారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కొత్తేమీ కాదని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, తెలంగాణ ధనిక రాష్ట్రం కావడం వెనుక తమ పార్టీ ఘనతే ఉందని అన్నారు.

‘ తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కల్పిస్తాం, లక్ష ఉద్యోగాలు ఇస్తాం, వరికి రూ. 3 వేల మద్దతు ధర కల్పిస్తామని ’ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి మొదటి వారంలో బస్సుయాత్ర, మే, జూన్  నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.