mictv telugu

ఈసారి బిగ్‌బాస్ హోస్ట్ ఎవరంటే…….

January 10, 2019

తెలుగు ప్రేక్షక లోకానికి కొత్త అనుభూతినిచ్చిన బిగ్‌బాస్ షో మరోసారి  కనువిందు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంతో మాటీవీ దశే తిరిగి పోయింది. గతంలో  ప్రారంభించిన రేలారేలా తర్వాత అంతకుమించిన పాపులారిటీ షో బిగ్‌బాస్. మనం మర్చిపోయిన జానపదాల జాతరతో తెలుగు ప్రేక్షకులకు మరోసారి ఊరి జీవితాలను గుర్తుకు తెచ్చింది. అప్పట్లో  ఈ షో పెద్ద హిట్. ఆ తర్వాత బిగ్‌బాస్ షో మాటీవీకి కొత్త తరం ప్రేక్షకులను తీసుకొచ్చింది.

సీజన్ 3 బిగ్‌బాస్ షో ప్రారంభం అవుతుందని అంటున్నారు.  సీజన్ 1లో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను బాగానే రంజింపచేశారు. తొలిసారి అలాంటి షో తెలుగు బుల్లితెరపై చూశారు. తొలి నుండి చివరకు కార్యక్రమం బాగా ఆకట్టుకుంది. సీజన్ 2 కాస్త డల్‌గా ప్రారంభం అయి తర్వాత ఊపందుకుంది. నాని హోస్ట్‌గా చేసిన సీజన్ 2 కూడా మాంచి క్రేజే సంపాదించుకుంది.

Telugu news This time is the Biggest Host .

తాజాగా మూడో  సీజన్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. తెలుగుతో పాటు మిగిలిన భారతీయ భాషల్లోనూ బాగా ఆకట్టుకుంటోంది ఈ షో. తమిళం, మళయాలం వంటి భాషల్లో సూపర్ హిట్ అయింది. హిందీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. హిందీలో బాగా సక్సెస్ అయిన తర్వాత తెలుగు బుల్లితెరపైకి వచ్చింది.

మూడో సీజన్లో మాంచి పేరున్న వారే హోస్ట్‌గా ఉంటరాని  అంటున్నారు. ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.  ఈ యేడాదిలో ప్రారంభమయ్యే ఈ షో ఎన్నికలకు ముందుగానే వస్తే బావుంటుందనే చర్చ కూడా ప్రారంభం అయింది. అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఇటు పార్లమెంట్ ఎన్నికలు దాదాపు ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. కాబట్టి  ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతే రాజకీయ షోలు ఫ్లాప్ అవుతాయని టాక్ వినిపిస్తోంది.

అంతకు ముందుగానే షో ప్రారంభం అవుతుందనే టాక్ కూడా  వినిపిస్తోంది. ఈ షో హోస్ట్‌గా ఉండేవారి స్థాయిని బట్టి కూడా రేటింగ్స్ ప్రభావితం అవుతాయని అంటున్నారు.   పేరున్న స్టార్‌ను తీసుకొస్తే ముందుగానే షోకు హైప్ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. షోలో పాల్గొనేవారి విషయంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందట.

ఈసారి సిన్మా రంగంతో పాటు , సంగీత, సాహిత్య, గేమ్స్ విభాగాల నుండి కూడా పాల్గొంటారని అంటున్నారు.  ప్రజలకు కాస్త పరిచయం ఉన్నవారు అయితే ఇంకా బాగా షో రక్తి కడుతుందని అంటున్నారట. ఇప్పటినుండి ప్రేక్షకుల్లో హైప్  క్రియేట్ చేస్తే షో ప్రారంభం అయిన తర్వాత కొత్తగా ప్రమోట్ చేసుకునే పరిస్థితి ఉండదని నిర్వాహకులు భావిస్తున్నారట. మార్కెట్లో  సీజన్ 3పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సారి షోలో పార్టిస్సెంట్స్ మాత్రమే కాదు… ఈవెంట్‌లో కూడా చాలా మార్పులు తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. మనుషుల అంతర్గత విషయాలను, వారి ప్రవర్తనలను,   నిజ మనస్తత్వాలను ఈ షో బయటకు తీసుకొస్తుందని చాలామంది నమ్ముతున్నారు. తమ జీవితాలకు సంబంధించి ఉంటుంది కాబట్టి షో బాగా ఆకట్టుకుంటున్నదని, అందువల్లనే సీజన్3పై అంచనాలు బాగా పెరుగుతున్నాయని వినోద రంగంలో టాక్ నడుస్తోంది.

Telugu news This time is the Biggest Host …….