ప్రసవానికి వెళ్తూ గర్భిణి డ్యాన్స్.. డాక్టర్ కూడా…

మనం గర్భిణులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. వారిని ఏ పనీ చేయనివ్వకుండా.. ఎక్కువగా నడవనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే ఆమెకు, కడుపులో ఉన్న బిడ్డకు ఏ ప్రమాదమూ జరగొద్దని. డెలివరీ అయ్యేదాక టెన్షన్ పడుతాం. ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్లి, డాక్టర్ బయటకు వచ్చి శుభవార్త చెప్పేదాక ఉత్కంఠతో ఎదురు చూస్తాం.  కానీ డెలివరీ సిజెరియన్ సర్జరీ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నఓ గర్భిణి.. డ్యాన్స్ చేసింది.

బాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ నటించిన ‘ దిల్ ధడక్నే దో’ చిత్రంలోని గర్ల్స్ లైక్ టూ స్వింగ్ పాటకు స్టేప్పులేసింది. ఈ వెర్రి ఘటన పంజాబ్‌లోని లుథియానాలో చోటు చేసుకుంది. వింత ఏంటంటే… సదరు డ్యాన్స్ గర్భిణిని ఆడ్డుకోకుండా  డాక్టర్ కూడా తైతక్కలాడ్డం. గర్భిణితో కలసి డాక్టరమ్మ కూడా చిందేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి చేష్టలు మంచివి కావని, కాస్త జారిపడితే తల్లిబిడ్డల ప్రాణాలకు ముప్పు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Telugu News This video of pregnant woman dancing with her doctor before delivery has Twitterati delighted