ఆ రైతులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ రైతులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు..

February 8, 2018

అనుకోకుండా ఆ గ్రామస్తులందరూ ఒకేసారి నక్కతోక తొక్కారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. దెబ్బకు ఆసియా దేశాల్లో సంపన్నుల గ్రామంగా రికార్డులకెక్కింది.  అరుణాచల్ ప్రదేశ్‌లోని బొంజా గ్రామంలో ఈ వింత జరిగింది.

వ్యవసాయం మీద ఆధారపడ్డ బొంజా గ్రామంలో 31 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భారత రక్షణ శాఖ కొన్ని కీలక స్థావరాలను నెలకొల్పేందుకు ఈశాన్య రాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుంది. అలా ఎంపిక చేసుకున్న గ్రామాల్లో బొంజా కూడా వుంది. ఆ గ్రామంలోని 31 కుటుంబాల చేతుల్లో వున్న 200 ఎకరాల భూమిని రూ. 40.83 కోట్లకు రక్షణశాఖ తీసుకుంది.

అలా నష్టపరిహారం పొందిన కుటుంబాలు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యాయి. ఈ పంపకాల్లో 29 కుటుంబాలకు కోటి 9 లక్షల రూపాయలను నష్ట పరిహారంగా చెల్లించింది. మిగతా రెండు కుటుంబాల్లో ఒక కుటుంబానికి 6.73 కోట్లు ఇవ్వగా, మరో కుటుంబానికి రూ. 2.44 కోట్లు అందించారు.