ఆరెస్సెస్ లో చేరితేనే హిందువు.. రాజాసింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆరెస్సెస్ లో చేరితేనే హిందువు.. రాజాసింగ్

February 6, 2018

ఆరెస్సెస్‌లో సభ్యులు కానివారు అసలు హిందువులే కారు ’ అంటూ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గోషామహల్ నియోజకవర్గ జీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ లోధా. ఆదివారం మద్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో జరిగిన ఓ భారీ బహిరంగ సభలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

‘ఆరెస్సెస్  ఒక ఫ్యాక్టరీ. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి మార్గదర్శకులను తయారుచేసింది. కనుక హిందువులందరూ తమ సమీపంలోని ఆరెస్సెస్‌లో పేర్లను నమోదు చేసుకోండి. సంఘ్‌లో చేరనివాళ్లు నా దృష్టిలో అసలు హిందువులే కారు. హిందూ జాతికి వారు సేవ చేయలేరు. మన దేశంలో పాకిస్తాన్ జిందాబాద్ అనేవారు, అఫ్జల్ గురు వంటి ఉగ్రవాదులను కొనియాడే ప్రజలు ఉన్నారు.

లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా, మతమార్పిడులకు పాల్పడుతున్న క్రిస్టియన్ మిషనరీలకు వ్యతిరేకంగా పోరాడాలి. శత్రుదేశాన్ని, ఉగ్రవాదులను పొగిడే ప్రజలను ప్రపంచంంలో ఏ దేశం కూడా భరించదు ’ అని హిందువులకు పిలునిచ్చారు.