mictv telugu

కులం పేరెత్తితే తంతా… కేంద్రమంత్రి వార్నింగ్

February 11, 2019

మన దేశంలోనొ కుల వ్యవస్థ  జాడ్యం గురించి తెలిసిందే. సినిమా, రాజకీయాలు, క్రీడలు… నానా రంగాల్లో ఈ రోగం వేళ్లూనుకుపోయింది. ఈ నేపథ్యంలో కులాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో కుల వివక్షను రూపుమాపాలని పిలుపిచ్చిన గడ్కరీ.. తానూ ప్రాతినిధ్యం వహిస్తున్న నాగపూర్‌ లోక్ సభ నియోజకవర్గంలో ఎవరైనా కులం గురించి మాట్లాడితే వారిని కొడతానని హెచ్చరించానని, అక్కడ ఎవరూ కులం గురించి మాట్లాడరని హెచ్చరించారు.

Telugu News 5 Men Wanted In Murder Cases Caught By Delhi Police After Shootout..

పుణెలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కులాలపై మాకు నమ్మకంలేదు. మన దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో కూడా నాకు తెలియదు. కుల, వర్గ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి భారతీయుడు కృషి చేయాలి.  పేదలకు సాయం చేయాలి. అది దేవుడికి సేవ చేయడంతో సమానం.. మీ ప్రాంతంలో ఎన్నికులాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ నా ప్రాంతంలో మాత్రం కులం అనేదే లేదు. ఎందుకంటే కులం గురించి ఎవరైనా మాట్లాడితే కొడతానని ముందే హెచ్చరించాను…అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.  సమాజంలో పేదలు, ధనవంతులు అనే తేడా ఉండకూడదు. ఎక్కువ కులం, తక్కువ కులం అన్న వ్యత్యాసం కనిపించకూడదు. పేదలకు దుస్తులు, ఆహారం, నివాసం సదుపాయాలు కల్పించి గౌరవించాలి. మానవ సేవే మాధవ సేవ…అని హితవు పలికారు.Telugu News Those who talk about caste will be thrashed by me Nitin Gadkari