దేశంలో అత్యంత కాలుష్య నగరాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో అత్యంత కాలుష్య నగరాలు ఇవే..

February 14, 2019

దేశంలో అత్యంత కాలుష్యమైన నగరం ఢిల్లీ.. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఢిల్లీని ఆ స్థానంలోంచి వెనక్కి నెట్టి.. మరో మూడు నగరాలు ముందు వరుసలో నిలిచాయి. గతంలో దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్య ప్రాంతమని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఐఐటీ కాన్పూర్, శక్తి ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో పాట్నా, కాన్పూర్, వారణాసిలు అత్యంత కాలుష్య నగరాలని తేలింది. దీంతో ఇన్నాళ్లు కాలుష్య నగరంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది. కాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసి ఈ జాబితాలో ఉండటం గమనార్హం.Telugu News Three Cities Beat Delhi To India's Most Polluted List Top Spot Goes To2018 సంవత్సరానికి గానూ ఈ మూడు నగరాల్లో అక్టోబర్-నవంబర్ మధ్యలో గాలి నాణ్యత సూచీ 2.5ను తాకిందని సర్వేలో తేలింది. గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి క్షీణించిందని వెల్లడించింది. అయితే అధిక జనాభా కలిగిన చైనా కంటే మన భారతదేశం 50శాతం గాలి కాలుష్యంతో ఇబ్బందులు పడుతుందని సర్వే పేర్కొంది. దీనికి అసలు కారణం ప్రభుత్వాలు కాలుష్య సమస్య పరిష్కారానికి కృషి చేయకపోవడమే ప్రధాన కారణమని, ఇప్పటికైన ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయకపోతే చాలా ప్రమాదమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.