mictv telugu

మోదీని ముప్పు తిప్పులు  పెడుతున్న ఆ ముగ్గురు….

February 12, 2019

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని  తన పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు ముప్పు తిప్పులు పెడుతున్నారు. సమయం చిక్కినప్పుడల్లా మోదీతో ఓ ఆట అడుకుంటున్నారు. ఇద్దరు  ముఖాముఖి మాట్లాడితే మరొకరు పరోక్షంగా చురకలు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మోదీ గురించి సొంత పార్టీలోనే అసమ్మతి రాగం రాగయుక్తంగా ఆలపిస్తున్న ఆ ముగ్గరు  యశ్వంత్ సిన్హా, శత్రుఘ్ను సిన్హా. మరొకరు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

Telugu news Three of those who are threatening Modi …..

 

ఈ ముగ్గరు నాయకులు పెద్ద నోట్ల  రద్దు తర్వాత నుంచి మోదీపై ఓ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. విపక్షాల కంటే వీరు చేసే విమర్శలే చాలా ఘాటుగా ఉంటున్నాయి. తాజాగా చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్షకు  ఈ ఇద్దరు సిన్హాలు హాజరయ్యారు.

చంద్రబాబు నేషన్ ఆఫ్ ది హిరో అంటూ శత్రుఘ్ను చెప్పారు. అంతేకాదు తాము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు. వ్యక్తి కంటే పార్టీ గొప్పదని, పార్టీ కంటే దేశం  గొప్పదని చెప్పారు సిన్హా. అంతేకాదు చంద్రబాబు చేస్తున్న దీక్ష కేవలం ఏపీకి సంబంధించింది మాత్రమే కాదన్నారు. ఇది యావత్ దేశానికి సంబంధించిన విషయమన్నారు. నరేంద్ర మోదీ పార్టీలో ఏకఛత్రాదిపత్యం చెల్లాయిస్తున్నారనే  ఆరోపణ ఎప్పటినుంచో ఉంది. బీజేపీలో వ్యక్తి సామ్యం చెల్లదు. వాజ్‌పేయి లాంటి మహామహులు కూడా సాధారణ వ్యక్తులుగానే ఉన్నారు. పెద్ద నాయకులు అయినా సరే పార్టీ కంటే తాము చిన్నవారమేనని భావించారు. అలాగే పనులు కూడా చేశారు. కానీ మోదీ వచ్చిన తర్వాత పరిస్థితులు మారి పోయాయి.

అమిత్ షాతో కలిసి అన్నీ తానే  అయి మోదీ వ్యవహరిస్తున్నారని పార్టీకి చెందిన కొందరు ఎంపీలు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. బహిరంగంగా విమర్శలు చేశారు. కొందరు దళిత ఎంపీలు మోదీ  వైఖరికి నిరసనగా రాజీనామాలు కూడా చేశారు.

ఆ తర్వాత మోదీపై సీరియస్‌గా విమర్శలు చేస్తున్నవారు నితిన్ గడ్కరీ ఆ తర్వాత ఈ ఇద్దరు సిన్హాలు. వీరి గురించి మోదీ కూడా ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. ఆయన అనుచరులు కూడా ఏమీ అనడం లేదు. పైగా వీరికి మాంచి ఫాలోయింగ్ ఉందనేది కూడా ఏమీ లేదు. అంటే వీరు లేవనెత్తుతున్న విషయం  సరైందనే అభిప్రాయం కూడా పార్టీలో ఉన్నట్లుంది.

అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హామీలిచ్చి అమలు చేయకపోతే జనాలు  తంతారని నితిన్ గడ్కరీ అన్నారు. అంతే కాదు పెళ్లాం పిల్లలను చూసుకోలేనివారు దేశాన్ని ఏం చేసుకుంటారని కూడా అన్నారు. ఇవన్నీ మోదీని ఉద్దేశించే అన్నారనే ప్రచారం కూడా ఉంది. మోదీ పైన ఇతర పార్టీల  వారికంటే సొంత పార్టీ వారే విమర్శలు చేసిన తర్వాత విపక్ష నాయకులు విమర్శల దాడి పెంచారు. మోదీ ఏకపక్ష నిర్ణయాల కారణంగా పార్టీకి నష్టం జరుగుతుందని వీరు బలంగా భావిస్తున్నట్లుంది. అందుకే అవకాశం దొరికితే చాలు ఓ ఆట ఆడుకుంటున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో గళం విప్పిందీ ఈ ముగ్గురే.

నరేంద్ర మోదీ వీరి విషయంలో  ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏం చేస్తారో  తెలియదు. ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి కాబట్టి ఆయన ఏమీ అనలేక పోతున్నారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత అసలు సిన్మా మోదీ చూపించక మానడు. అందుకేనేమో బీజేపీలో ప్రధానమంత్రి  అభ్యర్థిగా నితిన్ గడ్కరీ పేరు బయటకు వచ్చింది. అందుకే తాను భయపడుతున్నానని ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు.

Telugu news Three of those who are threatening Modi …