mictv telugu

రైలు కదిలినా రిజర్వేషన్.. ద.మ.రైల్వే ప్రయోగం

January 11, 2019

 ప్రయాణికులకు అరుదైన సేవలు అందించడంలో దక్షిణమధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. ఇప్పటి వరకు రైలు కదిలే సమయానికి ఖరారైన రిజర్వేషన్‌ బెర్తుల పట్టిక మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉండేది. కానీ ఇకపై రైలు కదిలాక కూడా ఖాళీ బెర్తుల వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకు తగ్గట్టుగా రైల్వే శాఖ తాజాగా హ్యాండ్‌ హెల్డ్‌ టర్మినల్స్‌ (హెచ్‌హెచ్‌టీ) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సాంకేతికత ద్వారా  రైలు కదిలాక కూడా రైల్లో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. డిజిటల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా మొదటిసారి ఈ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వేలో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అమిత్‌ వరదాన్‌ గురువారం ప్రారంభించారు.

Telugu News Ticket Checking On-Board Trains goes Hi-Tech on SCR .

హెచ్‌హెచ్‌టీ పరికరాల ద్వారా రైలు ప్రయాణంలో టికెట్ల తనిఖీని నిర్వహించనున్నారు. రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికుల వివరాలు ఈ టెక్నాలజీతో సులువుగా తనిఖీ చేయవచ్చు. వివిధ స్టేషన్‌ల మధ్య ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను తెలుసుకోవడంతోపాటు వాటిని కేటాయించే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధానాన్ని 51 రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అనంతరం తొలిసారి సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే నాలుగు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని సిబ్బందికి 40 హెచ్‌హెచ్‌టీ పరికరాలను అందించారు.

Telugu News Ticket Checking On-Board Trains goes Hi-Tech on SCR