ఊళ్లోకి వచ్చిన చిరుత...9మందిపై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

ఊళ్లోకి వచ్చిన చిరుత…9మందిపై దాడి

February 20, 2018

అడవిలోంచి దారి తప్పి వచ్చిన ఓ చిరత  9మంది గ్రామస్థులపై దాడి చేసింది. అసోం రాష్ట్రం జోర్హత్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దాడి చేస్తున్న పులిని  పట్టుకోవడానికి స్థానికులు, అటవీశాఖ సిబ్బంది కర్రలు పట్టుకుని  దాన్ని తరిమారు.

కర్రలతో కొడుతున్నా కూడా చిరుత తన దాడిని ఆపలేదు. ఈ దాడిలో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. చిరుత దాడి చేస్తున్న  దృశ్యాలు  సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత చిరుతని అటవీశాఖ సిబ్బంది పట్టుకుని అడవిలో వదిలేశారు.