సర్కస్‌ ప్రదర్శనలో మూర్చపోయిన పులి.. - MicTv.in - Telugu News
mictv telugu

సర్కస్‌ ప్రదర్శనలో మూర్చపోయిన పులి..

September 28, 2018

సర్కస్‌లో జంతు ప్రదర్శనలు నిషిద్ధమైనటికీ కొన్ని చోట్ల వాటిని విచ్చలవిడిగా నిర్వహిస్తునే ఉన్నారు. తాజాగా రష్యాలో నిర్వహించిన సర్కస్‌లో ఓ పులి ప్రదర్శన ఇస్తూ మూర్చపోయింది. ఆరేళ్ల వయసున్న జెనా అనే పులి రష్యాలోని ఓ సర్కస్ లో ఉత్సాహంగా విన్యాసం చేస్తోంది. పులి చేస్తున్న విన్యాసాలను చూసి ప్రేక్షకులు సంతోష పడుతూ చప్పట్ల వర్షం కురిపిస్తున్నారు. మంటలు మండుతున్న రింగులోంచి మిగతా పులులు అన్ని దూకేస్తున్నాయి. జెనా మాత్రం రింగు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందరి చప్పట్లు ఆగిపోయాయి. లేచినిల్చున్నారు. ఏం అయిందోనని ఆందోళన చెందుతున్నారు. రింగు మాస్టర్ జెనా దగ్గరికెళ్లి చూడగా ఉలుకూ పలుకూ లేకుండా మూర్చపోయింది.

దీంతో రింగు మాస్టర్ పులికి చికిత్స అందించేందుక చాలా ప్రయత్నాలు చేశాడు. అయినా చికిత్సకు జెనా స్పందించలేదు. జెనాను మిగతా పులు ఏం చేయకుండా చూస్తునే దానికి చికిత్స అందించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు రింగ్ మాస్టర్ పులిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం చూసి మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం నోరు లేని మూగజీవులను హింసించడం ఏంటని మండిపడుతున్నారు.

కాగా మూర్చ వ్యాధి వచ్చిన సమయంలో ఎలాంటి శద్ధం చేయకుంటే అది వెంటనే కోలుకునేది. కానీ సర్కస్ లోని మైకులు శద్ధం వస్తుండటంతో రింగ్ మాస్టర్ మైకులను బంద్ చేయాలని కేకలు వేశాడు.