‘టైగర్ జిందా హై’  ఫస్ట్‌లుక్ - MicTv.in - Telugu News
mictv telugu

‘టైగర్ జిందా హై’  ఫస్ట్‌లుక్

October 25, 2017

ట్యూబ్‌లైట్’ సినిమా అపజయం తర్వాత సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా సినిమా ‘టైగర్ జిందా హై’ సినిమా మీదే అందరి దృష్టీ వుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను సల్మానే తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశాడు.

సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జఫర్ దర్శకుడు. గూఢచారి నేపథ్యంలో థ్రిల్లింగ్‌గా ఈ సినిమాను మలుస్తున్నారు. 22 డిసెంబరు 2017 న విడుదల అవుతున్న ఈ సినిమా కోసం సల్మాన్ ఫ్యాన్స్ చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ‘ఈగ’ ఫేం సుదీప్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ‘ఏక్ థా టైగర్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ఇది.  సల్మాన్, కత్రినాల లుక్ పోస్టర్ మీద చాలా అద్భుతంగా వుందంటున్నారు నెటిజనులు.