శ్రీవారి సర్వదర్శనానికీ ఆధార్.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీవారి సర్వదర్శనానికీ ఆధార్..

November 22, 2017

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి ఇక నుంచి గంటలు తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. టీటీడీ దేవస్థానం భక్తుల కష్టాలను తీర్చేందుకు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విధానం ద్వారా కేవలం 2 గంటలలోనే స్వామివారి  దర్శనం కల్పించడానికి శ్రీకారం చుట్టింది.  అందుకోసం డిసెంబర్ 10,12 తేదీలలో ప్రయోగత్మకంగా  స్లాట్ విధానం అమలుకు టీటీడీ  కసరత్తు ప్రారంభించింది. ఈ విధానం ద్వారా నిత్యం 22వేల నుంచి 38 వేల  భక్తులకు సర్వ దర్శనం టోకన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో 21 ప్రాంతాలలో 150 కౌంటర్ల ద్వారా టోకన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు.టీటీడీ అధికారులు టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అని  ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారి టోకన్ పొందిన భక్తుడికి మరో 48 గంటల వరకు టోకన్ పోందే అవకాశం ఉండదు. ఫిబ్రవరి నుంచి నూతన విధానాన్ని పూర్లి స్థాయిలో అమలు చేయనున్నారు. ఇప్పటికే నిత్యప్రవేశదర్శనం , నడకదారి భక్తులు కలిపి 38వేల మందికి టోకన్లు జారీ చేస్తున్నారు.. ఈ స్లాట్ విధానం అమలులోకి వస్తే భక్తులందరికి శ్రీవారి సర్వదర్శనం సులభంగా లభిస్తుందని టీటీడీ అధికారులు చెప్పుతున్నారు.