టీజేఎస్, సీపీఐ పోటీ చేసే స్థానాలు ఇవే..

తెలంగాణ విపక్ష మహాకూటమిలో సీట్లు గొడవ సద్దుమణుగుతోంది. ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సీట్లను కేటాయించింది. దీంతో టీజేఎస్, సీపీఐలు తమ అభ్యర్థుల ఖరారులో ముగినిపోయాయి. ఇక సీపీఐఖి వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే తమకు ఇంకో సీటు కావాలని చాడ వెంకటరెడ్డి పట్టుబడుతున్నారు. తమకు బలమున్న కొత్తగూడెం సీటును కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.  కాంగ్రెస్ 93 స్థానాల్లో, టీడీపీ 14 చోట్ల, తెలంగాణ ఇంటిపార్టీ ఒక సీట్లో బరిలోకి దిగుతున్నాయి.

tt

టీజేఎస్ అభ్యర్థుల వివరాలు

టీజేఎస్ తాను పోటీ చేయబోయే 8 స్థానాల్లో ఆరింటికి అభ్యర్థులను సూత్రప్రాయంగా ఖరారు చేసింది. చెన్నూరు, మిర్యాలగూడల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. కోదండరాం పోటీ చేసే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. మీడియాలో వస్తున్న  వార్తలు, పార్టీల లీకుల ప్రకారం.. .

  1. సిద్ధిపేట – భవానీరెడ్డి
  2. దుబ్బాక – రాజ్ కుమార్
  3. వరంగల్ ఈస్ట్ – ఇన్నయ్య
  4. మల్కాజ్ గిరి – దిలీప్
  5. మహబూబ్ నగర్ – రాజేందర్ రెడ్డి.
  6. మెదక్- జనార్ధన్ రెడ్డి

Telugu  news TJS candidates confirmed in six constituencies part of mahakutami for upcoming Telangana assembly elections