బీజేపీతో చేయి కలిపే ప్రసక్తే లేదు.. కోదండరాం - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీతో చేయి కలిపే ప్రసక్తే లేదు.. కోదండరాం

October 1, 2018

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీజేపీతో టీజేఎస్ చేయి కలుపుతోందని వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత కోదండరామ్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్ పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సాగుతున్న నిరంకుశ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని అని పేర్కొన్నారు. మహాకూటమి కోసం నేడు, రేపు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో చర్చలు జరుపుతామన్నారు.

Do not ask to join hands with the BJP TJS Kodandaram

అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, సీట్లకు సంబంధించిన చర్చ ఇంకా మొదలు కాలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై మహాకూటమిలో ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటు అంశాలపై కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల నేతలు చర్చించనున్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపేందుకు ధూంధాం కార్యక్రమం చేపట్టామన్నారు. అక్టోబర్ 4వ తేదీని సిద్దిపేటలో పోరుయాత్ర ప్రారంభిస్తామని, 10న వరంగల్‌లో ముగింపు సభ జరుపుతామని కోదండరామ్ పేర్కొన్నారు.