ఈరోజు ఆయన గెటప్ సత్యహరిశ్చంద్రుడు - MicTv.in - Telugu News
mictv telugu

ఈరోజు ఆయన గెటప్ సత్యహరిశ్చంద్రుడు

March 21, 2018

పార్లమెంట్ ఆవరణలో రోజుకో గెటప్‌తో దర్శనమిస్తున్న టిడిపి ఎంపీ శివప్రసాద్ ఈరోజు కూడా ఓ చిత్రమైన గెటప్‌తో వచ్చారు.కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సత్యహరిశ్చంద్రుడి వేషంలో వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల విషయంలో ఎన్‌డీయే సర్కార్ మాట తప్పిందని పేర్కొంటూ ఆయన ఈ గెటప్‌లో నిరసన తెలిపారు.తెలుగు ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారని కేంద్రప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. మాట ఇచ్చి తప్పని సత్యహరిశ్చంద్రుడిలా అప్పుడు మాట ఇచ్చి మమ్మల్ని నమ్మించి, ఇప్పుడిలా ప్లేటు ఫిరాయించిన కేంద్రంపై ఆయన సెటైర్లు వేశారు. ఇదిలా వుండగా ఈరోజు పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. టిడిపి, వైకాపాలు అవిశ్వాసంపై చర్చ జరపాలంటూ ఓవైపు.. రిజర్వేషన్ అంశంపై టీఆర్ఎస్, కావేరీ జలాల బోర్డుపై అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి చొచ్చుకెళ్ళటంతో గందరగోళం నెలకొంది. దీంతో సభ రేపటికి వాయిదా పడింది.