రేవంత్ రెడ్డి టీడీపీలో కొనసాగుతారా లేదా.. అన్నది ఇవాళ అమరావతిలో తేలనున్నది. టీడీపీ భవిష్యత్తుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వనున్నారు. అధ్యక్షుడి ఆజ్ఞ మేరకు తెలంగాణ టీడీపీ నాయకులందరూ నేడు అమరావతికి పయనమయ్యారు. అయితే చంద్రబాబు తెలంగాణ నాయకులతో విడివిడిగా కలిసి వారి అభిప్రాయాలు విననున్నారు. రేవంత్ కూడా ఏకాంతంగా భేటీ అవనున్నారు. అందరి వాదనలు విన్న తర్వాతే రేవంత్ టీడీపీలో కొనసాగుతారా లేదా అనేది చంద్రబాబు తేలుస్తారు.