రూపాయి నోటు వయసు..  వందేళ్ళు - MicTv.in - Telugu News
mictv telugu

రూపాయి నోటు వయసు..  వందేళ్ళు

November 30, 2017

నేటితో నూరు వసంతాల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్నది ఒక రూపాయి నోటు. ఈ నోటు గురించి చులకనగా మాట్లాడేవారు మరింత  గౌరవించుకోవాల్సిన తరుణమిది. 1917 నవంబర్‌ 30న ప్రవేశపెట్టిన ఈ రూపాయి నోటుకు, 2017 నవంబర్‌ 30తో వందేళ్లు నిండాయి. తొలిసారి ఈ నోటును కింగ్‌ ఐదో జార్జ్‌  ఫోటోతో బ్రిటిష్ ప్రభుత్వం తన వలస దేశమైన భారత్‌లో ప్రవేశపెట్టింది.మొదటి ప్రపంచ యుద్ధంలో ఆయుధాలను తయారుచేసేందుకు రూ.1 కాయిన్లను వాడటంతో, ఈ నోటు ప్రవేశం జరిగింది. అప్పుడు దీని విలువ 10.7 గ్రాముల వెండికి సమానంగా ఉండేది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి రూ. 390గా ఉంది. అంటే రూపాయి నోటు విలువ దాదాపు 400 వంతు తగ్గిపోయింది.  1949లో ఆర్థిక శాఖ కార్యదర్శి కేఆర్‌కే మీనన్ సంతకం చేసిన నోటుపై మొట్టమొదటిగా అశోకుడి స్తూపం ముద్రించారు.  1994లో ఆపేసిన రూపాయి నోటు 2015 మార్చి 6వ తేదీ మళ్ళీ కనిపించింది. ీ నోటు ముద్రించేందుకు రూ.1.14 ఖర్చవుతున్నట్టు సమాచార హక్కుచట్టంలో వెల్లడైంది. 1935 ఏప్రిల్‌ 1వ తేదీన రూపాయి నోటు ముద్రణకు అనుమతిని  కేంద్ర బ్యాంకు  ఆంగ్లేయులు అప్పగించారు.  1861 నుంచే కరెన్సీ నోట్ల జారీని గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా చేపడుతున్నప్పటికీ, 1917లోనే రూపాయి నోటును ప్రవేశపెట్టారు.చరిత్ర రూపాయి నోటుకు కానుకగా ఇచ్చిన రోజు ఈ రోజు. భారతదేశ కరెన్సీ రూపాయితోనే మొదలవుతుంది కాబట్టి రూపాయిని ఈ సందర్భంగానైనా గౌరవించుకోవాల్సన అవసరం ఎంతో వుందంటున్నారు దాని విలువ ఎరిగిన పెద్దలు.