ప్రభాస్‌కు ప్రేమతో… - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్‌కు ప్రేమతో…

October 24, 2017

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సోమవారం 38వ బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కోస్టార్ అనుష్క ఖరీదైన డిజైనర్ వాచ్‌ను కానుకగా ఇచ్చినట్లు సినీ వర్గాల సమాచారం.ప్రభాస్‌కు చేతి  వాచీలు అంటే చాలా ఇష్టం. అందుకనే అనుష్క  ప్రభాస్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన వాచ్‌ని కానుకగా ఇచ్చింది. ‘బాహుబలి 2’ తర్వాత అనుష్క ,ప్రభాస్ ప్రేమించుకుంటున్నట్లు వార్తాలు చక్కర్లు కొట్టాయి.

వీరు డిసెంబర్ లో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు కూడా ఊహాగానాలు వినిపించాయి. దీనిపై ప్రభాస్ స్పందిస్తూ… తన పెళ్లి  గురించి వస్తున్న  వార్తల్లో  ఏ మాత్రం నిజం లేదని స్పష్టత ఇచ్చాడు. అనవసరంగా ఇలాంటి తప్పుడు వార్తలు రాయకూడదు అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. మరో పక్క అనుష్క‘ భాగమతి’ చిత్రీకరణతో చాలా బిజీగా ఉన్నాంది. నవంబర్ లో  ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.