‘అర్జున్ రెడ్డి’ సందీప్‌కు బంపర్ ఆఫర్

 

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు అదృష్టం తలుపు తట్టింది. విజయ్ దేవరకొండ  హీరోగా సందీప్ తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌ కొత్త ట్రెండ్ స‌ృష్టించాడు.  ప్రశంసలతోపాటు విమర్శలు కూడా అందుకున్నాడు. 4 కోట్లతో నిర్మించిన ఈ మూవీ 40 కోట్లకుపైగా  వసూల్ చేసింది. దీంతో పలువురు హీరోలు, నిర్మాతలు ఆయన ఇంటిముందు క్యూ కడుతున్నారు. ‘శ్రీమంతుడు’, ‘జనాత గ్యారేజ్’ వంటి సినిమాలను నిర్మించిన మైత్రి మూవీ  మేకర్స్ అధినేతలు సందీప్‌ను సంప్రదించి, తమ సినిమాకు దర్శకత్వం వహించేందుకు ఓప్పించారని  సినీ వర్గాల సమాచారం. రూ. 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారని టాక్. ప్రస్తుతం ఈ సంస్థ  రామ్ చరణ్ హీరోగా రంగస్థలం, నాగచైతన్యతో సవ్యసాచి చిత్రాలను నిర్మిస్తోంది. ఇప్పటికిప్పుడు సందీప్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తాన్నారని, అయితే ఈ మూవీలో హీరో ఎవరన్నది తెలియదు. గతంలో హీరో శర్వానంద్ సందీప్ దర్శకత్వంలో హీరోగా ఒక సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

SHARE