హమ్మయ్య.. నో కామెడీ, వేణు నామినేషన్‌కు ఓకే - MicTv.in - Telugu News
mictv telugu

హమ్మయ్య.. నో కామెడీ, వేణు నామినేషన్‌కు ఓకే

November 19, 2018

ఎన్నికలో నామినేషన్ ప్రక్రియ పైకి కనిపించేంత సులువైన వ్యవహారమేమీ కాదు. అన్ని పత్రాలు పక్కాగా ఉంటే ఓకే అవుతుంది. ఏ చిన్న తేడా వచ్చినా ఇంటి ముఖం పట్టి, మళ్లీ తిప్పలు పడాల్సి వస్తుంది. గడువు ముగిసే టైంలో మరింత సంకటంగా మారుతుంది వ్యవహారం. ఎన్నికల్లో అనుభం లేని ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఇదంతా కామెడీలా ఉందని విమర్శలు కూడా వచ్చాయి.Telugu news Tollywood Comedian Venumaadhav nomination accepted for consideration to contest in Kodad assembly constituency Telangana  దీంతో ఆయన ఈ సారి పకడ్బందీగా నామినేషన్ పత్రాలు రూపొందించుకుని ఈ రోజు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. డిపాజిట్, ప్రతిపాదకుల సంఖ్య, అఫిడవిట్ వివరాలు సరిగ్గా ఉండడంతో వాటిని పరిశీలన కోసం తీసుకున్నారు. వేణు తన స్వస్థలమైన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అనారోగ్యం, అవకాశాల్లేక వేణు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు.