పోలింగ్ బూత్‌లో రాఘవేంద్రరావుకు చేదు అనుభవం.. - MicTv.in - Telugu News
mictv telugu

పోలింగ్ బూత్‌లో రాఘవేంద్రరావుకు చేదు అనుభవం..

December 7, 2018

సెలబ్రిటీలు కలిపిస్తే జనం ఆసక్తిగా చూస్తారు, అభిమానం కురిపిస్తారు. తోక తిప్పితే మాత్రం మడిచిపెడతారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన హైదరాబాద్లోని జూబ్లిహిల్స్ ఫిల్మ్నగర్లో శుక్రవారం ఓటేసేందుకు వెళ్లారు. అయితే క్యూలో నిలుచోకుండా నేరుగ బూత్లోకి వెళ్లబోయారు. దీంతో అప్పటికే చాలాసేపటి నుంచి క్యూలో నిల్చున్న జనం ఆయనను ‘ఆగు.. మేం మనుషులం కామా? క్యూలో నిల్చోవయ్యా’ అని అడ్డుకున్నారు. కొందరు దూషణలకు కూడా దిగారు.Telugu news Tollywood director Raghavendra Rao face embarrassing situation while bypassed que in polling station Telangana assembly election

దీంతో అవమానంగా భావించిన రాఘవేంద్రరావు ఓటేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోపక్క టాలీవుడ్‌ నటులు పలువురు పద్ధతిగా క్యూలో నిల్చుని ఓటేస్తున్నారు. అయితే వీరిలో కొందరు క్యూలు తప్పించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో చిరంజీవి కూడా క్యూను కాదని నేరుగా బూతులో వెళ్లబోతుండగా ఓ యువకుడు అడ్డుకుని హితవు పలికాడు.