పాపం.. ఈ టాలీవుడ్ హీరోల వద్ద డబ్బుల్లేవట..

 చెప్పేదొకటి చేసేదొకటి సామెత సినిమా మన తెలుగు సినిమా హీరోలకు, సీనీరాజకీయ హీరోలకు అతికినట్లు సరిపోతుంది. నీతుల వల్లింపు కేవలం వెండితెరకే పరిమితం. ట్రాఫిక్ ఉల్లంఘన విషయంలో మన హీరోలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తాత్సారం కూడా తోడుకావడంతో తమపై ఎవరూ చర్యలు తీసుకోలేరన్న ధీమాతో విర్రవీగుతున్నారు.

Telugu news Tollywood heroes failed to pay traffic fines since three years including balakrishna Mahesh babu pawan Kalyan Hyderabad police negligence .

చలాన్లు వచ్చి రెండు మూడేళ్లు దాటుతున్నా కట్టకుండా పరువు తీసుకుంటున్నారు.  నందమూరి బాలకృష్ణ, సూపర్స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సునీల్, నితిన్ తదితరుల ఘనకార్యాల వివరాలు బయటికొచ్చాయి. వారి వాహనాలు ఓవర్స్పీడ్పార్కింగ్ నిబంధనలు ఉల్లఘించి ట్రాఫిక్ కెమెరాకు చిక్కడంతో చలాన్లు పడ్డాయి. ‘శ్రీమంతుడు’ ఏడు చలాన్ల కింద రూ. రూ. 8,745 పెండింగ్లో ఉంది. మూడేళ్లవుతున్నా ఆయన చెల్లించడం లేదు. బాలకృష్ణ బండి రాజేంద్రనగర్ వద్ద అతివేగంగా వెళ్లడంతో రూ.1035 ఫైన్ పడింది. ఆయనా దాన్ని కట్టలేదు. పవర్ స్టార్  2016 నుంచి మూడు చలాన్ల కింద రూ. 505 కట్టాల్సి ఉండగా ఆయనా పాపం చెల్లించలేకపోతున్నారు. ఈ హీరోలకు సదరు చలాన్ల మొత్తం చాలా చిన్నదే అయినా చెల్లించకపోవడం ఆశ్చర్యంగా ఉందని, అయితే వారు సెలబ్రిటీలు కనుక చర్యలు తీసుకోలేకపోతున్నామని పోలీసులు వాపోతున్నారు.

Telugu news Tollywood heroes failed to pay traffic fines since three years including balakrishna, Mahesh babu, pawan Kalyan Hyderabad police negligence