కంగ్రాట్స్ కౌశల్.. ఎంజాయ్... మహేశ్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

కంగ్రాట్స్ కౌశల్.. ఎంజాయ్… మహేశ్ బాబు

October 3, 2018

బిగ్‌బాస్ 2 విన్నర్‌గా  ఎవరు గెలిస్తారని ప్రేక్షకులు చాలా ఉత్కంఠగా ఎదరుచూశారు. చివరికి కౌశల్ బిగ్‌బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన విషయం  తెలిసిందే. కౌశల్ విజేతగా నిలుస్తాడా లేదా అని ప్రేక్షకులు అనుకున్నారు. అదే సమయంలో కౌశల్ ఆర్మీ, కౌశల్‌కు సపోర్టు చేశారు. దీంతో కౌశల్ విజేతగా నిలిచాడు.

కౌశల్, ప్రిన్స్ మహేశ్ బాబుకు వీరాభిమాని. తన  కెరియర్ ప్రారంభంలో మహేశ్ బాబు ప్రోత్సహించాడని కౌశల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా కౌశల్ విజేతగా నిలిచినందుకు మహేశ్ తన ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ‘కంగ్రాట్స్ కౌశ‌ల్.. ఇది పెద్ద విజ‌యం.. నీ విజ‌యం ప‌ట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఈ స‌క్సెస్‌ను ఎంజాయ్ చెయ్‌` అంటూ త‌న అభిమాని కౌశ‌ల్‌కి సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ట్వీట్ చేశాడు.