మహేశ్ హీరోగా జక్కన్న చిత్రం

దర్శకదీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపుగా ఐదేళ్లు నిద్రాహారాలు మాని పనిచేశాడు. ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని కూడా ఆయన అందుకున్నాడు.అయితే ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ఏ ప్రాజెక్ట్ చేస్తాడు? చిన్న హీరోలతో చేస్తాడా? లేక పెద్ద హీరోతో భారీ బడ్జెట్ సినిమా చేస్తాడా..? అని ఎన్నో అనుమానాలు అభిమానులకు వస్తున్నాయి. ఈ తరుణంలో రాజమౌళి ఓ పాపులర్ అమెరికన్ ఎంటర్ టైన్‌మెంట్‌వెబ్ పోర్టల్‌కి ఇచ్చిన  ఇంటర్వ్యూలో తన తర్వాతి రెండు ప్రాజెక్టుల గురించి తెలిపాడు. తర్వాతి  చిత్రం డివీవీ ఎంటర్‌టైన్ మెంట్ బేనర్‌లో డివీవీ దానయ్య  నిర్మాణంలో చేయనుండగా, రెండో ప్రాజెక్ట్ కె‌ఎల్ నారాయణ నిర్మాణంలో చేస్తున్నాడు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించనుండడం విశేషం. ఈ ప్రాజెక్ట్ 2019లో సైట్స్ పైకి వెళ్లనుంది. మహేశ్ ప్రస్తుతం‘ భరత్ అను నేను’ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో  నటిస్తున్నాడు. తర్వాత వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేయనున్నాడు.

SHARE