‘జిందగీ’కి క్లీన్ చిట్ - MicTv.in - Telugu News
mictv telugu

‘జిందగీ’కి క్లీన్ చిట్

October 21, 2017

రామ్ కథానాయకుడుగా నటించిన చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’  సెన్సార్‌‌ను పూర్తి చేసుకుంది. ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్  ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్  సోషల్ మీడియాలో తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, పాటలకు ఇప్పటికే  విశేష స్పందన లభించింది. ఈ చిత్రంలో రామ్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటించారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు.‘నేను శైలజ’ చిత్ర దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటిస్తున్న 2వ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం అక్టోబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.