నా కొడుకు 'మహాభారతం' తీస్తాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

నా కొడుకు ‘మహాభారతం’ తీస్తాడు..!

September 13, 2017

బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి1,2 సినిమాల కోసం ఐదు సంవత్సరాలు కష్టపడి తెరకెక్కించాడు. ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయంతో పాటు ,భారీ కలెక్షన్లను బాహుబలి వసూల్ చేసింది. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా ఏది కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. కానీ అప్పట్లో రాజమౌళి మహాభారతం సినిమాను తాను తప్పకుండా తెరకెక్కిస్తానని ఓ షోలో చెప్పాడు. ఇప్పుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా తన కొడుకు తప్పకుండా ‘మహాభారతం’ సినిమాని తీస్తాడు అని చెప్పాడు. నాకొడుక్కు యుద్దాలంటే బాగా ఇష్టం. ఆ యుద్దాల కోసం అయినా మహాభారతం తీస్తాడు. కానీ అదెప్పుడనేది మాత్రం నేను చెప్పలేను అని విజయేంద్ర ప్రసాద్ అన్నాడు. రాజమౌళి తీసిన అన్ని సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలను ఇస్తూ వస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం శ్రీవల్లీ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.