సమంత పెళ్లికి వందమందే.. 

టాలీవుడ్ మోస్ట్  క్రేజీ కపుల్ సమంత , నాగచైతన్య మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి గోవాలో కేవలం వంద మంది సమక్షంలో చాలా సింపుల్ గా జరగనుందని నాగార్జున ప్రకటించాడు. పెళ్లి కోసం అభిమానులతోపాటు, సినీ ప్రముఖులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వివాహనికి అక్కినేని కుటుంబం, దగ్గుబాటి కుటుంబం, సమంత కుటుంబంతోపాటు అత్యంత సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొననున్నట్టు సమాచారం.

పెళ్లి సమయం దగ్గర పడుతుడంతో పెళ్లి పనులు చురుకుగా సాగుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలసి సమంత ,చైతూలు ఆనంద క్షణాలను గడుపుతున్నారు. తాజాగా చై, సాము కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రైడ్ విషెష్ అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించిన సమంత , నాగచైతన్యతో కలసి ఫోటో దిగారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. 6న హిందూ సంప్రదాయం, ప్రకారం 7న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరగనుంది. కొంత సమయం తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ ని గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.