మామా,అల్లుళ్ల  మల్టీ స్టారర్  - MicTv.in - Telugu News
mictv telugu

మామా,అల్లుళ్ల  మల్టీ స్టారర్ 

November 1, 2017

టాలీవడ్‌లో మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకున్నాయి. వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందని సమాచారం. ‘ప్రేమమ్’ చిత్రంలో వెంకటేష్ గెస్ట్ రోెల్‌లో కనిపించాడు. అయితే ఇపుడు ఓ సినిమా మొత్తం, మామ, అల్లుళ్లు కలిసి నటించబోతున్నారు.

ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని, ఈ సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రానుందని తెలుస్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’,‘రారండోయ్ వేడుక చూద్దాం’  సినిమాలను తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ. మామ అల్లుడు‌తో సినిమా తెరకెక్కించేందుకు మంచి స్క్రిప్ట్ రెడి చేశాడట.  సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నాగచైతన్య చందూ మెండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి ’చిత్రంలో నటిస్తు‌న్నాడు. మరోపక్క వెంకటేశ్, తేజ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు.