భరత్ అను నేను.. టాలీవుడ్‌లో రికార్డు బ్రేక్   - MicTv.in - Telugu News
mictv telugu

భరత్ అను నేను.. టాలీవుడ్‌లో రికార్డు బ్రేక్  

March 16, 2018

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భరత్ అను నేను’ . ఈ సినిమా టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డును సొంతం చేసుకుంది.  అత్యధిక వ్యూస్‌ను సాధించిన టీజర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డు ఇంతకుముందు పవన్ కల్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ పేరుతో ఉంది. అజ్ఞాతవాసి టీజర్ అత్యధిక వ్యూస్,లైకులు సాధించిన చిత్రంగా ఉండేది. కానీ మార్చి 6న విడుదలైన ‘భరత్ అను నేను’ టీజర్ అజ్ఞాతవాసి రికార్డును దాటివేసింది.
‘భరత్ అను నేను’ టీజర్ సందేశాత్మకంగా, స్టైలిష్‌గా ఉండటంతో ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఇప్పటివరకు కోటి 32 లక్షల మంది వీక్షించడంతోపాటు 5. 26 లక్షల లైకులు సాధించకుని యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా  కనిపించబోతున్నాడు. సమకాలీన రాజకీయాలతో తెరకెక్కిన భరత్‌ అనే నేను ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.