మార్చిలో శ్రియ పెళ్లి.. వరుడు రష్యావాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

మార్చిలో శ్రియ పెళ్లి.. వరుడు రష్యావాడు..

February 6, 2018

దక్షిణాది సీనియర్ హీరోయిన్, మూడున్నర పదుల అందాల భామ శ్రియ శరణ్ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది.  మార్చిలో పెళ్లి కుతూరు కానుంది. ఆమె రష్యాకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో మునిగితేలుతోందని టాలీవుడ్ టాక్.

పెళ్లి విషయం గురించి ఆ  యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఆమె  రష్యాకు వెళ్లిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డెహ్రడూన్కు చెందిన ఈ భామ పెళ్లి పనులు రాజస్థాన్ లో జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ విషయంపై శ్రియ నుంచి ఎలాంటి అధికార ప్రకటనా రాలేదు.

శ్రియ 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. 35ఏళ్లు దాటుతున్నా కుర్ర హీరోయిన్లతో  గ్లామర్‌లో గట్టిగానే పోటీ ఇస్తోంది.. దాదాపుగా అందరు సీనియర్ హీరోలందరితో నటిస్తూ 17 ఏళ్ల నుంచి  కెరీర్‌ను కొనసాగిస్తోంది. తెలుగు,తమిళ భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది.