కలెక్టర్‌గా నయనతార…!

నయనతార విభిన్నమైన కథలను ఎంపిక చేసుకొంటూ వరుస విజయాల్ని అందుకుంటోంది. నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘ఆరమ్ ’తెలుగులో‘ కర్తవ్యం ’పేరుతో విడుదల చేయనున్నారు. గోపి నైనర్ దర్శకత్వంలో ఆర్ .రవింద్రన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార జిల్లా కలెక్టర్‌గా కనిపించబోతుంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు నిర్మాత తెలిపారు. ఈ సినిమా రాజకీయం  నేపథ్యంలో , నాటకీయ పరిణామాలతో ఆసక్తికరంగా సాగనుందని నిర్మాత తెలిపారు. మా టైడెంట్ ఆర్ట్స్ పతాకంపై శివలింగ, విక్రమ్ , వేదా తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించామని , 450 చిత్రాలను పంపిణి చేశామని, ఈచిత్రం కూడా అందరి  అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందని  నిర్మాతలు అంటున్నారు.

SHARE