టమోటా సాస్‌ను జ్యూస్‌లా జుర్రేసి వరల్డ్ రికార్డ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

టమోటా సాస్‌ను జ్యూస్‌లా జుర్రేసి వరల్డ్ రికార్డ్ !

February 19, 2018

గిన్నిస్‌బుక్‌లో రికార్డులు నెలకొల్పటం అతనికి జ్యూస్ తాగినంత సులభం. అందుకే ఈసారి గిన్నిస్‌లో రికార్డ్ నెలకొల్పటానికి టమోటా సాస్‌ను కొన్ని సెకన్ల వ్యవధిలోనే గటగటా తాగేసాడు. టమోటా సాస్‌ను ఏ సమోసాకో, పిజ్జా, బర్గర్‌‌లోనో వేసుకొని తింటారు. కానీ ఇతను తాగేసి రికార్డు నెలకొల్పాడు.

ముంబయికి చెందిన దినేష్ ఉపాధ్యాయ.. కేవలం 25.37 సెకన్ల వ్యవధిలోనే 396 గ్రాముల టమోటా సాస్ ( కెచప్ ) తాగేసి గిన్నిస్‌బుక్ ఎక్కేశాడు. అక్కడున్నవాళ్ళంతా అతని చర్యలు చూస్తూ ఆశ్చర్యపోవడం వారి వంతైంది. సాస్ తాగాక అతనికి చాలాసేపు దగ్గు ఆగకుండా వచ్చింది. ఏదేమైనా తను అనుకున్నది సాధించాడు. మూడవసారి తన పేరును గిన్నిస్ పేజీల్లో లిఖించుకున్నాడు.

 

 

ఇంతకు ముందు ఆయన 22 వెలుగుతున్న కొవ్వొత్తులను నోటిలో పెట్టుకుని రికార్డు సాధించాడు. ఒక్క నిమిషంలో 73 ద్రాక్ష పండ్లు తిని రెండవ రికార్డు కూడా తన పేరున నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడవ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇతనికి గిన్నిస్‌బుక్ వాళ్లు సరదాగా  ‘ మాక్సి మౌత్ ’ అని పేరుపెట్టారు. ‘ మున్ముందు ఇంకా ఇలాంటి రికార్డులు నెలకొల్పాలనేది నా కోరిక ’ అన్నాడు దినేష్. క్రింది లింక్‌లో వీడియోను చూడవచ్చు.