టూరిస్టు బస్సుకు తప్పిన ప్రమాదం..

జయశంకర్ భూపలపల్లి జిల్లాలో ఓ టూరిస్టు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలతో చుండ్రుపల్లి వాగు పొంగిపొర్లింది.. ఆ సమయంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శకుల టూరిస్టు బస్సు వాగులో చిక్కుకుపోయింది. వరద ప్రవాహం తక్కువ ఉందని భావించిన బస్సు డ్రైవర్  అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. సగం దూరం వరకూ బాగానే వెళ్లిన బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు రక్షించండి అని కేకలు వేశారు. ఏం ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు.

Tourist bus stuck in river

వాగులోకి దిగుతున్న బస్సును ఇవతలి వైపుఒడ్డున ఉన్న బస్సులోని ప్రయాణిలంతా చూశారు. వెంటనే స్పందించి.. వారిని రక్షించేందుకు ఒడ్డున ఉన్న బస్సులోని తాళ్లను తీసుకొని కొందరు వాగు మధ్యలో ఉన్న బస్సు దగ్గరి దాకా ఈదుకుంటు వెళ్లారు. బస్సుకు తాడు కట్టి ఒడ్డుపై ఉన్న బస్సుతో బయటకు లాగారు.. దీంతో బస్సులోని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ఒడ్డుపైన మరో బస్సులేకపోతే వారి ప్రాణాలు పోయేవని పేర్కొన్నారు.